CJIగా డీవై చంద్రచూడ్ చివరి జడ్జ్‌మెంట్.. ‘హ్యాపీగానే ఉన్నా’

CJIగా డీవై చంద్రచూడ్ చివరి జడ్జ్‌మెంట్.. ‘హ్యాపీగానే ఉన్నా’

సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గా డీవై చంద్రచూడ్ రెండు సంవత్సరాలు సేవలు అందించారు. సీజేఐ చంద్రచూడ్‌ 2022 నవంబర్‌ 8 నుంచి ఈ పదవిలో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్ 10న ఆయన డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కాబట్టి.. ఈరోజు (నవంబర్ 8)న ఆయన లాస్ట్ వర్కింగ్ డే. సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం సీజేఐ డీవై చంద్రచూడ్ కు వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ చివరి ప్రసంగం చేశారు. రేపటి నుంచి తాను న్యాయం చేయలేననే మాట వాస్తవమని.. అయినప్పటికీ సీజేఐగా చేసిన సేవ ఆయనకు సంతృప్తిగా ఉందన్నారు. సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. సంజీవ్‌ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.

ALSO READ : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీజేఐగా చివరి జెడ్జ్‌మెంట్ ఇదే..

అలీఘ‌డ్ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనార్టీ హోదా విషయంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చివరి జడ్జ్‌మెంట్ ఇచ్చారు. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్రచూడ్ నాయ‌క‌త్వంలోని ఏడుగురు ధ‌ర్మాస‌నం నాలుగు ర‌కాల తీర్పుల‌ను వెలువ‌రించింది. ఏఎంయూ కేసులో నాలుగు ర‌కాల అభిప్రాయాలు ఏర్పడ్డాయ‌ని, దీంట్లో మూడు వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. విద్యా సంస్థ నియంత్రణ‌, ప‌రిపాల‌న విష‌యంలో పార్లమెంట్‌లో చ‌ట్టం చేసినా.. ఆ విద్యాసంస్థకు ఉన్న మైనార్టీ హోదాను ర‌ద్దు చేయ‌ర‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తెలిపింది. పార్లమెంట్ చ‌ట్టంతో అలీఘ‌డ్ ముస్లిం వ‌ర్సిటీ మైనార్టీ హోదా ర‌ద్దు అయిన‌ట్లు 1968లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టిపారేస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. అడ్మినిస్ట్రేష‌న్‌లో మైనార్టీ స‌భ్యులు లేనంత మాత్రాన‌.. ఆ వ‌ర్సిటీ మైనార్టీ హోదా పోదు అని సుప్రీంకోర్టు చెప్పింది.