నూతన హైకోర్టు భవనం కట్టేది కరీంనగర్ రాయితోనే : అలోక్ ఆరాదే

నూతన హైకోర్టు భవనం కట్టేది కరీంనగర్ రాయితోనే : అలోక్ ఆరాదే

తెలంగాణ హైకోర్టు నూతన భవనం కట్టడానికి ఉపయోగించే రాయి కరీంనగర్ నుంచి తెస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణంలో నిర్మించబోయే కొత్త బిల్డింగ్ శంకుస్థాపనకు ఆదివారం హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు హాజరైయ్యారు. శంకుస్థాపన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్, సెషన్స్ కోర్టు జడ్జి ప్రతిమ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పోక్సో, ఫ్యామిలీ కోట్లు సహా మరో10 కోర్టుల కాంప్లెక్స్ తో పాటు, జ్యూడిషియల్ అధికారుల కోసం 20 నివాస సముదాయాల నిర్మాణ పనులను ప్రారంభించారు. 

Also Read : అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఖాళీ సీట్లు ఇప్పుడే అప్లై చేసుకోండి

హైదరాబాద్ నూతన హైకోర్టు భవనానికి ఉపయోగించబోయే స్టోన్ కరీంనగర్ జిల్లా నుంచి తీసుకెళ్లినట్లు చీఫ్ జస్టిస్ చెప్పారు. గొప్ప చరిత్ర గల జిల్లా కరీంనగర్ అని ఆయన అన్నారు. జిల్లా కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలని న్యాయకోవిదులకు సూచించారు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే. ఇప్పుడున్న కరీంనగర్ కోర్టు భవనం1956లో ప్రారంభించబడింది.