- జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
- కొత్త కోర్టుల బిల్డింగ్ నిర్మాణాలకు భూమి పూజ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు కొత్తగా ఫ్యామిలీ కోర్టుతో పాటు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులు అదనంగా రానున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో అదనపు కోర్టు బిల్డింగ్ల నిర్మాణాలకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు.
ఈ ప్రోగ్రాంలో న్యాయమూర్తులు గొల్లపూడి భానుమతి, బత్తుల రామారావు, ఎ. సుచరిత, పి, సాయి, వి. శివనాయక్, బార్అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, గవర్నమెంట్ ప్లీడర్ పలివెల గణేశ్ బాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు.