చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలి : వసంత్​ పాటిల్​ 

చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలి : వసంత్​ పాటిల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడ్వొకేట్స్​చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్​ పాటిల్​ సూచించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్​లో సీనియర్​అడ్వొకేట్​ ఉదయ్​ భాస్కర్​ అధ్యక్షతన శనివారం జరిగిన ఇండియన్​ అసోసియేషన్​ఆఫ్​ లాయర్స్(ఐఏఎల్​)​ జిల్లా స్థాయి స్టడీ సర్కిల్​లో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు చట్టాలతో పాటు తీర్పులను కూడా నిరంతరం అధ్యయనం చేయాలన్నారు.

ఐఏఎల్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోట్ల మాధవరావు, బొమ్మగాని ప్రభాకర్​ మాట్లాడుతూ అప్రజస్వామికంగా వచ్చిన కొత్త చట్టాలను సవరించాల్సి ఉందని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడంలో బీజేపీ ముందుందని ఆరోపించారు. ఈ ప్రోగ్రాంలో మూడో అదనపు మెజిస్ట్రేట్​ శివ నాయక్, సీనియర్​ సివిల్​జడ్జి భానుమతి, జూనియర్​ సివిల్​ జడ్జి రామారావు, రెండో అదనపు మెజిస్ట్రేట్​ సాయిక్ష, తెలంగాణ బార్​ కౌన్సిల్​ మెంబర్​ దుస్సా జనార్దన్​, సీనియర్​ న్యాయవాదులు గంటా విద్యాసాగర్​ రెడ్డి, కేవీకే గుప్తా, ఐఏఎల్​ జిల్లా అధ్యక్షుడు ఎస్​. సత్యనారాయణ, బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ పాల్గొన్నారు.