కరీంనగర్ లో రవీందర్ సింగ్ కూతురు పెళ్లికి హాజరైన కేసీఆర్ 

కరీంనగర్ :  కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ నుంచి హెలికాప్టర్ లో కరీంనగర్ కు చేరుకున్న కేసీఆర్ కు... మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, మేయర్ సునీల్ రావు, జెడ్పీ చైర్మన్ విజయ స్వాగతం పలికారు. ఆ తర్వాత అందరూ వీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరయ్యారు. 

రవీందర్ సింగ్ కూతురి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ వెంట మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ తర్వాత  ముఖ్యమంత్రి కేసీఆర్.. కరీంనగర్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి టీ తాగి.. తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 
అంతకుముందు.. సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే మార్గంలో పోలీసులు ట్రయన్ రన్ నిర్వహించారు.