
మహబూబాబాద్ జిల్లా : ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్ వివరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 12వ తేదీన మహబూబాబాద్ లో ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. పోడు భూముల హక్కు పత్రాలు జారీలో ఆలస్యం కావడం వల్ల బహిరంగసభ సభను వాయిదా వేశామని చెప్పారు.అందరూ సమన్వయంతో కేసీఆర్ టూర్ ను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.
12న సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదే :
* ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
* ఉదయం 11 గంటలకు నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం
* ఉదయం 11 : 30 నుండి మధ్యాహ్నం 12: 30 వరకు 10 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష
* మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష
* మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పయనం