విశాఖ KGHను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

విశాఖ KGHను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

విశాఖపట్టణం: ఆన్లైన్ విధానంలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే పరిస్థితులు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రాలో ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్న విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ను (KGH) సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఢిల్లీ ఎయిమ్స్కు ఎటువంటి గుర్తింపు ఉందో ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే పదేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర డేటా ఇంటిగ్రేషన్ జరుగుతుందని, ప్రజారోగ్యంపై ఇటీవల సర్వేలో 9 శాతం పైగా షుగర్, బీపీలతో బాధపడుతున్నట్టు తేలిందని గుర్తుచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. KGHలో రూ.60 కోట్లతో లెవల్-2 క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేజీహెచ్ను కేంద్ర ప్రభుత్వం సికెల్ సెల్ అనీమియా కేంద్రంగా గుర్తించిందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

►ALSO READ | Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట