హైదరాబాద్, వెలుగు:ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేశారు. మొగిలయ్యకు హయత్ నగర్ లో 600 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
ఇందుకు సంబంధించి స్థల ధ్రువీకరణ పత్రాలను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మొగిలయ్యకు అందజేశారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా ఉన్నారు. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.