హైదరాబాద్‌ శాంతి భద్రతల విఘాతానికి కుట్ర.. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ శాంతి భద్రతల విఘాతానికి కుట్ర.. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది కావాలనే హైదరాబాద్ లో శాంతి భద్రతలు విఘాతం కలిగించి.. అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహాల్ స్టేడియంలో అక్టోబర్ 21న నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరైయ్యారు. ఈ ప్రొగ్రామ్ లో డీజీపీ జితేందర్, హోం శాఖ ఉన్నత అధికారులు, పోలీసు డిపార్ట్‪మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కోరారు.

Also Read :- విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం

ఎంతో భావాద్వేగంతో పోలీసులు పని చేస్తున్నారని వారి విధులకు ఆటంకాలు కలిగించకూడదని ఆయన హెచ్చరించారు. పోలీసుల సేవలు గుర్తించాలని రేవంత్ రెడ్డి ప్రజలకు కోరారు. వివిధ మతాల పండుగలకు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘించే వారిని చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త, కొత్త తరహాలో రోజురోజుకు సైబర్ క్రైమ్ లు పెరిగిపోతున్నాయని.. చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల వలలో పడటం బాధకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టాడానికి ట్రై చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు టీజీ న్యాభ్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి.. డీజీ స్థాయి అధికారిని నియమించామన్నారు. శాంతి భద్రతలను ఎవ్వరూ చేతిల్లోకి తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.