యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ త్వరలోనే ఏర్పాటు: సీఎం రేవంత్

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ త్వరలోనే ఏర్పాటు: సీఎం రేవంత్

హైదరాబాద్: పోలీస్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది పిల్లల భవిష్యత్కు తమది గ్యారంటీ అని, వచ్చే అకాడమిక్ ఇయర్లో పోలీస్ పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

త్వరలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కీలక ప్రకటన చేశారు. అన్ని ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉండనుందని, ఫస్ట్ విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సీఐడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీ గ్రౌండ్స్లో తెలంగాణ పోలీస్ ఫస్ట్ డ్యూటీ మీట్-2024 క్లోజింగ్ సెర్మనీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీసులు చేసేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని అన్నారు. రాష్ట్ర సాధనలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాన్ని ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. 2013 నుంచి 2024 వరకూ పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఫస్ట్ టైం డ్యూటీ మీట్ జరుగుతుందని సీఎం తెలిపారు. 

ALSO READ : కేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం: సీఎం రేవంత్

పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండి శాంతిభద్రతలను కాపాడుతున్నారని పోలీసుల సేవలను సీఎం కొనియాడారు. నేడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులే కారణం అని చెప్పారు. శాంతిభద్రతలు బాగున్న చోటకి పెట్టుబడులు వస్తాయని, హైదరాబాద్ మహా నగరంగా ఎదగడానికి పోలీసులే కారణం అని సీఎం వివరించారు.తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.