- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు
- లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్
షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రామినేని, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ తదితరులు సోమవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి కొండా సురేఖను కలిశారు. లారీ యజమానుల సమస్యలను మేనిఫెస్టోలోని పెట్టామని, వాటిని అమలు చేస్తానని హామీ ఇచ్చారని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని సీఎం కోరారని లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన్ పోస్టర్ ను విడుదల చేసినట్టు చెప్పారు.