మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం వద్ద దెబ్బతిన్న నేషనల్ హైవే 365ను రోడ్డును పరిశీలించనున్నారు. రోడ్డు మార్గంలో తొర్రూరు నుంచి నెల్లికుదురు మండలం రావిరాలకు చేరుకుని ముంపు ప్రాంతాలు, పంట నష్టాన్ని పరిశీలించనున్నారు
అనంతరం తొర్రూరు మండలంలో పర్యటించి వరంగల్ జిల్లాకు వెల్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఆఫీసర్లు తమ శాఖ పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి సమగ్ర సమాచారాన్ని సీఎంకు నివేదించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ కు తక్షణ సహాయంగా రూ.5 కోట్లు మంజూరు చేశారు.