రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ

రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ

రైతులకు ఒకే సారి 2 లక్షల రూపాయల రుణ మాఫీకి సంబంధించి వస్తున్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించటం కోసమే అని.. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణ మాఫీ చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 

2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల తర్వాత.. రేషన్ కార్డు నిబంధన అంశంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తం కావటంతో.. ఈ విధమైన క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 2024, జూలై 16వ తేదీ తెలంగాణ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో.. సీఎం రేవంత్ రెడ్డి పై విధంగా స్పందించారు.
 

రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించటం కోసమే అని.. 2 లక్షల రూపాయల పంట రుణ మాఫీ అనేది.. ఆయా రైతులకు ఉండే భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణ మాఫీ జరుగుతుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.