- తెల్లవారుఝాము నుంచి ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు
ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం చంద్రుడు కనిపించడంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. తెల్లవారుఝామునే భోజనాలు ముగించుకుని.. తెల్లవారకముందే మొదటి నమాజుతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. మొదటి నమాజుకు ముందు నుండి దీక్ష విరమించే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కఠోర ఉపవాస దీక్ష చేస్తారు.
కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో దాదాపు రెండేళ్ల తర్వాత రంజాన్ మాసాన్ని మునుపటి వలే నిర్వహించుకునేందుకు ముస్లిం సోదరులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఊహించినట్లే ఇవాళ చంద్రుడు కనిపించడంతో ముస్లిం కుటుంబాల్లో సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మసీదులను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి రంజాన్ మాసాన్ని ఉత్సాహంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ముఖ్యమంత్రి కె.చందరశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సీఎం ఆకాంకింక్షారు. తెలంగాణ కు ప్రత్యేకమైన "గంగజమునా తెహజీబ్ " మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని సీఎం కేసిఆర్ అభిలషించారు.
ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు
పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని ఆయన పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారని కొనియాడారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని సీఎం జగన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
చండీఘఢ్ను పంజాబ్కు ఎలా బదిలీ చేస్తారు?
వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు