సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ బుధవారం సందర్శించారు. ముత్యాలమ్మను దర్శించుకుని శాంతి పూజ చేశారు.
సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రార్థిస్తూ అష్టోత్తర పారాయణం చేశారు. హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది దాడి చేయడం బాధాకరమన్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నవారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.