కొండెక్కిన కోడిగుడ్డు.. చికెన్ చీప్!

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. శనివారం ఒక్క గుడ్డు ధర రూ.7కు చేరింది. చలికాలం కావడం, ఇటు కూరగాయల ధరలు పెరగడంతో డిమాండ్​కు అనుగుణంగా కోడిగుడ్డు ధరలు సైతం భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హోల్ సేల్ దుకాణాల్లో 30 గుడ్ల ట్రేను రూ.189కి, రిటేల్ దుకాణాల్లో రూ. 210 కి అమ్ముతున్నారు. ఇదే సమయంలో మొన్నటి వరకు రూ.250 వరకు ఉన్న కేజీ చికెన్ ధర అమాంతం రూ.180కి పడిపోయింది.