తెలంగాణ స్టేట్ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో..చికితకు గోల్డ్ మెడల్

తెలంగాణ స్టేట్ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో..చికితకు గోల్డ్ మెడల్

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు : తెలంగాణ స్టేట్ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆర్చర్‌‌‌‌‌‌‌‌ టి. చికిత రావు గోల్డ్ మెడల్ గెలిచింది. కొల్లూరు ఢిల్లీ ప‌‌‌‌బ్లిక్ స్కూల్ (డీపీఎస్‌‌‌‌)లో సోమవారం జరిగిన  కాంపౌండ్ విభాగం ఫైనల్లో చికిత అందరికంటే ఎక్కువగా 697 పాయింట్లు సాధించి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. ఎన్‌‌‌‌.మాన‌‌‌‌స (రంగారెడ్డి) ర‌‌‌‌జ‌‌‌‌తం, ఎం.శ్రేష్ట రెడ్డి (హైద‌‌‌‌రాబాద్‌‌‌‌) కాంస్యం గెలిచారు. 

ఇక, గ‌‌‌‌త వారం జ‌‌‌‌రిగిన నేషనల్ ట్రయల్స్‌‌‌‌లో సత్తా చాటి ఆర్చరీ వ‌‌‌‌ర‌‌‌‌ల్డ్‌‌‌‌క‌‌‌‌ప్‌‌‌‌, ఆసియా క‌‌‌‌ప్‌‌‌‌కు ఎంపికైన చికిత‌‌‌‌ను తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.రాజు, సంగారెడ్డి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.ఎస్ ప‌‌‌‌వ‌‌‌‌న్ క‌‌‌‌ళ్యాణ్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో  డీపీఎస్ చైర్మన్‌‌‌‌ టి.భీమ్‌‌‌‌సేన్‌‌‌‌, వైస్ చైర్మన్‌‌‌‌ టీ.వీ ప్రణ‌‌‌‌య్ కుమార్, తెలంగాణ ఆర్చరీ సంఘం కార్యదర్శి అర‌‌‌‌వింద్  పాల్గొన్నారు.