హైదరాబాద్ సిటీలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు హీరో అల్లు అర్జున్. ఒక రోజు ముందే నోటీసులు ఇవ్వటంతో.. ఆ మేరకు పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ తర్వాత.. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ చేసి వ్యాఖ్యలు, కామెంట్లపై పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. మొత్తం 10 ప్రశ్నలకు పైనే అడిగారు. ఈ ప్రశ్నలను ఇప్పుడు అల్లు అర్జున్ ముందు ఉంచారు.. విచారణలో అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న పోలీస్ ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న 1 : పుష్ప -2 స్పెషల్ షోకు సంధ్య థియేటర్ కు వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు..?
ప్రశ్న 2 : పోలీసులు అనుమతిచ్చారని మీకు ఎవరు చెప్పారు..?
ప్రశ్న 3: సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా..? ఇవ్వలేదా..?
ప్రశ్న 4: తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా..?
ప్రశ్న 5: మీడియా ముందు నాకు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు...?
ప్రశ్న 6: రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా...?
ప్రశ్న 7: అనుమతి లేకుండా రోడ్ షో ఏవిధంగా నిర్వహించారు..?
ప్రశ్న 8: మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా ధియేటర్ కు వచ్చారు..?
ప్రశ్న 9: మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీ కి సంబంధించిన వారు...?
ప్రశ్న 10: ఎంత మంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు...?
ప్రశ్న 11: అభిమానుల మీద, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి
పోలీసులు ఇలా టకటకా అడుగుతున్న ప్రశ్నలతో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంట.. తాను చెప్పాలనుకున్నది చెప్పటానికి అది ప్రెస్ మీట్ కాదు కదా.. అందుకే ఆచితూచి చెబుతున్నారంట.. పోలీస్ నోటీసులు వచ్చిన వెంటనే.. తన లీగల్ టీంతో రాత్రంతా డిస్కషన్ చేసిన అల్లు అర్జున్.. మళ్లీ లీగల్ ఇష్యూస్ రాకుండా అతి జాగ్రత్తగా.. ఆచితూచి సమాధానం ఇస్తున్నారంట.