
జగదేవపూర్ (గజ్వేల్) వెలుగు: శివాజీ విగ్రహ వివాదం నేపథ్యంలో గజ్వేల్ లో ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇదే విషయమై మంగళవారం క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ర్యాలీ నిర్వహించాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విగ్రహ వివాదంలో పోలీసులు ఇప్పటి వరకు11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రెండు రోజులుగా జరిగిన వివిధ ఘటనలకు సంబంధించి పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు.
బుధవారం కూడా గజ్వేల్ లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా తనిఖీలు నిర్వహించారు. బుధవారం గజ్వేల్ లో సీపీ శ్వేత మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గజ్వేల్ లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు.