కూసుమంచి,వెలుగు : సెల్లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన మండలంలోని నాయకున్గూడెం గ్రామంలో జరిగింది. ఎస్ఐ రమేశ్‌కుమార్ తెలిపిన ప్రకారం చిలకబత్తిని వెంకటేశ్వర్లు ప్రవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సెల్లో ప్రకటన చూసి గుర్తు తెలియని లింక్‌ను క్లిక్ చేసి టాస్క్ ను పూర్తి చేశాడు. ఆ లింక్‌లో ఉన్న సూచనలు పాటించి రూ,1.9 లక్షలు డిపాజిట్ చేశాడు.
అయితే పనులు పూర్తి చేసినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోర్టల్1930 డయల్ చేసి వెంటనే ఫిర్యాదు చేశాడు. అతను చెల్లించిన అమౌంట్ లో నుంచి అకౌంట్లో రూ.59వేలు హోల్డ్ చేశామన్నారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.