పద్మారావునగర్ లో దవాఖానాలు, మెట్రో స్టేషన్లే టార్గెట్​ .. 18 బైక్ ల దొంగ అరెస్టు

పద్మారావునగర్ లో దవాఖానాలు, మెట్రో స్టేషన్లే టార్గెట్​ .. 18 బైక్ ల దొంగ అరెస్టు
  • రూ. 10 లక్షల విలువ చేసే టూ వీలర్స్​ స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: దవాఖానాల ఎదుట పార్క్​ చేసిన బైక్​లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న ఓ దొంగను చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి18 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్​ డీసీపీ బాలస్వామి ఆదివారం  హైదరాబాద్​లోని చిలకలగూడ పీఎస్​లో కేసు వివరాలు వెల్లడించారు.  కామారెడ్డికి చెందిన శ్రీనివాస్​ (35) దొంగతనాలకు అలవాటు పడ్డాడు.  దవాఖానాలకు వెళ్లి తాళం వేసి ఉన్న బైక్‌‌‌‌‌‌‌‌లను డమ్మీ తాళం చెవితో ఎత్తుకెళ్లి అమ్ముకునేవాడు. మూడేండ్లుగా గాంధీ, నిలోఫర్, ఉస్మానియా, ఈఎస్ఐ, మెదక్​ దవాఖానాలతో పాటు మియాపూర్, మెట్టుగూడ, బాలానగర్​ మెట్రోస్టేషన్​, తదితర ప్రాంతాల్లో పార్క్​చేసిన 18 బైక్​ లు దొంగతనం చేశాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి వద్ద నిఘా పెట్టిన చిలకలగూడ పోలీసులు సీసీ ఫుటేజీల సాయంతో  బైక్‌‌‌‌‌‌‌‌లను ఎత్తుకెళుతున్న శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను పట్టుకొని విచారించారు. ఈ కేసుల్లో మొత్తం రూ. 10 లక్షలు విలువ చేసే 18 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.  ప్రధాన నిందితుడు కే. శ్రీనివాస్​తో పాటు చోరీ చేసిన బైక్‌‌‌‌‌‌‌‌లను కొనుగోలు చేసిన బెజవాడ ఏసురత్నం, బీ.శాంతారావు, అనంగి శ్రీనులను అరెస్ట్ చేశారు.

వరుస బైక్‌‌‌‌‌‌‌‌ల దొంగతనాల కేసును ఛేదించిన చిలకలగూడ డిటెక్టివ్​ ఇన్ స్పెక్టర్​ రమేశ్​గౌడ్, ఎస్.ఐ ఆంజనేయులు, కానిస్టేబుళ్లు నవీన్​ కుమార్​, జగదీశ్​, షేక్​బాషా, గణేశ్, వినయ్​ కుమార్​, కృష్ణ, హెడ్​ కానిస్టేబుళ్లు కృష్ణ, ప్రమోద్​, నరేశ్​ లను డీసీపీ బాలస్వామి అభినందించి, వారికి క్యాష్​ రివార్డులను అందజేశారు.  అడిషనల్​ డిప్యూటీ కమిషనర్​ నర్సయ్య,  ఏసీపీ జైపాల్​రెడ్డి,  సీఐ అనుదీప్​, ఎస్​ఐ సబిత సిబ్బంది పాల్గొన్నారు.