
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి చిత్రాల్లో నటించిన ఆనంద్ వర్థన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో సామ్, వంశీ కృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్. ఫిబ్రవరి 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ ‘మా సినిమాకు స్టోరీనే మెయిన్ హైలైట్. ఒక ప్రేమకథకు, నిద్రకు ఏమిటి సంబంధం అనేదే ఈ సినిమా. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వాలని, కొత్త కథ చెప్పాలనే లక్ష్యంతో చేసిన సినిమా ఇది. అనూప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని చెప్పాడు. నిద్ర నేపథ్యంలో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీ ఇదని దర్శకుడు చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ రోష్ని థ్యాంక్స్ చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, నిర్మాతలు సామ్, వంశీ కృష్ణ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.