- హైలెస్సో.. హైలెస్సా
ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో సామ్ జి, వంశీ కృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్. ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా..’ అనే ఫస్ట్ సాంగ్‌ను మంత్రి మల్లారెడ్డి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Also Read :- సూర్యాపేటలో అక్టోబర్ 2 న ఐటీ హబ్ ప్రారంభం : జగదీశ్ రెడ్డి
‘సొరసేప ఎదురై.. కొరమీను కులుకే.. సంద్రయ్య ఈ కథ సూసి ఉప్పొంగేలే..’ అంటూ సాగే పాటలో ఆనంద్ గడ్డంలో మాసివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సముద్ర తీరంలోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన మెలోడీ పాటకు డి.ప్రసన్న కుమార్ లిరిక్స్ రాయగా, ధనుంజయ్ సీపాన, ఏ.ప్రవస్తి కలిసి పాడారు. రామ రాజు, పోసాని కృష్ణ మురళి ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.