Rohan Roy Remuneration: రోహన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో ప్రాజెక్టుకి లక్షల్లో!

#90’s మిడిల్ క్లాస్ బయోపిక్(#90's A middle class biopic) వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు ఆదిత్య హాసన్(Adithya Haasan) తెరకెక్కించిన ఈ సిరీస్ లో శివాజీ(Shivaji), వాసుకి ఆనంద్ సాయి(Vasuki Anand Sai), మౌళి(Mouli), రోహన్ రాయ్(Rohan Roy) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ సూపర్ సిక్స్ అయ్యింది. ఫ్యామిలీ, కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఈ సిరీస్ లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా శివాజీ చిన్న కొడుకుగా నటించిన రోహన్ రాయ్ తెగ వైరల్ అయ్యాడు. 

అల్లరి పిల్లాడిగా ఆ పాత్రలో రోహన్ అద్భుతంగా నటించాడు. తన క్యూట్ క్యూట్ నటనతో, డైలాగ్స్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు ఈ బుడ్డోడు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించిన రోహన్ చెక్, విజయ విధేయ రామ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు #90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ సిరీస్ సక్సెస్ వరుస సినిమాలు, సిరీసుల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు ఈ బుడ్డోడు.

ALSO READ :- మద్యం పెట్టిన చిచ్చు భార్యని పారతో కొట్టి చంపిన భర్త

ఇందుకోసం రెమ్యునరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడట. ఒక్కో ప్రాజెక్టు లక్షల్లో సంపాదిస్తున్నాడట. రోజుకు రూ.30 వేల చొప్పున ఛార్జ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడట. ఒక సినిమాకు మినిమమ్ 30 రోజుల కాల్ షీట్స్ అనుకున్నా మొత్తం తొమ్మిది లక్షల వరకు పారితోషకంగా అందుకుంటున్నారు రోహన్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రోహన్ రాయ్ రెమ్యునరేషన్ గురించి తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. చిన్న వయసులోనే ఈ రేంజ్ లో సంపాదిస్తున్నావ్ అంటే మామూలు విషయం కాదు బ్రో.. త్వరలోనే కోట్లలోకి వచ్చేస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.