వరంగల్ అర్బన్ : వరంగల్ ఎంజీఎంలో 10 రోజుల పాప కోసం ఇద్దరు మహిళలు గొడవ జరిగింది. పుట్టిన పసిపాప తమ పాపే అని ఇద్దరు తల్లులు చెప్పడం హాస్పిటల్ లో గందరగోళం రేపింది.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో పదిరోజుల కింద ఓ పాపకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఐతే.. ఈ బిడ్డ నా బిడ్డే… నాకు ఇచ్చారు అంటూ మరో తల్లి వాదించడంతో .. ఇష్యూ పెద్దదైంది. పేగు పెంచుకుని పుట్టిందంటూ ఓ మహిళ… లేదు పుట్టగానే తనకు దత్తతలాగా ఇచ్చారని మరో మహిళ చెప్పారు. పాప ఎంజీఎం పిల్లల వార్డులో చికిత్స పొందుతుండగా ఇద్దరు మహిళలు ఇలా గొడవ పడటం కనిపించింది.
వివాదం ఇదీ.. అలా సద్దుమణిగింది..
సీకేఎం హాస్పిటల్ లో ఈ పాప పదిరోజుల కిందట పుట్టింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన ఓ దంపతులకు పాప పుట్టింది. ఐతే.. పాప వాళ్ల అమ్మమ్మ… మరో మహిళ కోరడంతో పాపను ఆమెకు ఇచ్చింది. తన కూతురు తనకు కావాలంటూ పాప తల్లి ఆవేదన చెందడంతో.. వెతుక్కుంటూ ఎంజీఎం వచ్చారు. ఎంజీఎంలో పాపను తన బిడ్డగా రికార్డుల్లో రాయించింది దత్తత తీసుకున్న మహిళ. ఇక్కడే గొడవైంది. ఇద్దరు మహిళలు తమ బిడ్డంటే తమ బిడ్డంటూ వాదించారు. ఇది క్రైమ్ అనీ.. డాక్టర్లు దత్తత తీసుకున్న మహిళను హెచ్చరించారు. చివరకు పాప అమ్మమ్మ, డాక్టర్ల జోక్యంతో… చిన్నారి తల్లి ఒడికి చేరింది.