నీళ్ల బకెట్​లో పడి బాలుడి  మృతి

పాలకుర్తి, వెలుగు:   ఆడుకుంటూ వెళ్లి  నీళ్ల  బకెట్​లో  పడి   ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది. పాలకుర్తి అంగడి బజారులోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కడకంచి రాములమ్మ, మల్లేశ్​ దంపతుల కొడుకు దానియల్ (16 నెలలు) ఆదివారం ఇంట్లో ఆడుకుంటున్నాడు.  తల్లిదండ్రులు బయట తమ పనులు చేసుకుంటున్నారు.  ఆడుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న బకెట్​ నీళ్లలో దానియల్ తలకిందులుగా పడి ఊపిరాడక చనిపోయాడు.