పల్లీ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి.. అబ్దుల్లాపూర్​మెట్ లష్కర్ గూడలోఘటన

పల్లీ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి.. అబ్దుల్లాపూర్​మెట్ లష్కర్ గూడలోఘటన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: పల్లీలు గొంతులో ఇరుక్కుని ఓ చిన్నారి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లస్కర్ గూడకు చెందిన శ్యాంసుందర్, మాధవి దంపతులు. వీరి కుమార్తె తన్విక(4) సోమవారం ఉదయం ఇంట్లో పల్లీలు తింటుండగా, ఒక పల్లి గొంతులో ఇరుక్కుని తీవ్ర అస్వస్థత కి గురైంది. దీంతో సమీప ఆసుపత్రికి తరలించగా, వారు నీలోఫర్ హాస్పిటల్​కు రిఫర్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.