మునుగోడులో నామినేషన్ వేసిన కోమటిరెడ్డి సాయితేజ్ రెడ్డి

మునుగోడులో నామినేషన్ల దాఖలు ప్రక్రియ  కొనసాగుతోంది. చిన్నపిల్లల వైద్యుడు కోమటిరెడ్డి సాయి తేజ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చండూరు బస్టాండ్ నుంచి ఎద్దుల బండి మీద ర్యాలీగా వచ్చి.. నామినేషన్ వేశారు. రైతులను రాజును చేస్తామన్న నేతలు.. కనీసం రైతును రైతుగా చూడటం లేదని కోమటిరెడ్డి సాయి తేజ్ రెడ్డి విమర్శించారు . రైతుల పక్షాన పోరాడేందుకే ఈ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

మునుగోడులో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇవాళ టీజేఎస్ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్,  బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్  వేయాల్సి ఉంది. నవంబర్ 3న మునుగోడుకు పోలింగ్ జరుగుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ  ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.