ఓ వైపు తల్లికి ఫిట్స్​ నీటి సంపులో పడి చిన్నారి కన్నుమూత

ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌‌‌‌పూర్  గ్రామంలో బుధవారం సాయంత్రం నీటి సంపులో పడి ఏడాది వయస్సున్న చిన్నారి చనిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గోపాల్‌‌‌‌పూర్ కు చెందిన పర్లపల్లి మంజునాథ్,- దీక్షిత దంపతులకు లియాన్సి (1) అనే కూతురు ఉంది. మంజునాథ్  ఓ సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి దీక్షిత ఇంటివద్దే ఉంటున్నది. బుధవారం సాయంత్రం దీక్షితకు ఫిట్స్  రాగా పొరుగువారు వచ్చి సపర్యలు చేస్తున్నారు. ఈ టైంలోనే లియాన్సి ఆడుకుంటూ వెళ్లి సంపులో పడిపోయింది. కాసేపటి తర్వాత చూడగా సంపులో విగతజీవిగా కనిపించింది.