నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నీటిలో పడి చిన్నారి గల్లంతయ్యింది. ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి ఇంటికి సమీపంలో ప్రవహిస్తున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయినట్లు తల్లిదండ్రులు, స్థానికులు గుర్తించారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారి కార్యాలయంలో సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక అటవీశాఖ అధికారి కార్యాలయం సమీపంలో మారుతి , పూజలు నివాసముంటున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారికి కూతురు చిన్నా అనన్య ఉంది.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీటితో అటవీశాఖ అధికారి కార్యాలయం సమీపంలో డ్రైనేజీ కాల్వ ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారంఆగస్టు 21, 2024 న ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అనన్య మురికి కాల్వ నీటిలో గల్లంతయినట్లు పాప తల్లిదండ్రులు,స్థానికులు చెబు
షయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది,స్థానికులు పాప ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి అనన్యం మిస్సింగ్ తో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.