ఒరేయ్ అది ఆడుకునే బండి కాదురా..ఎయిర్ పోర్ట్ బ్యాగేజ్ బెల్ట్పై రైడ్ చేసిన బాలుడు..

ఒరేయ్ అది ఆడుకునే బండి కాదురా..ఎయిర్ పోర్ట్ బ్యాగేజ్ బెల్ట్పై రైడ్ చేసిన బాలుడు..

చీలీలో శాంటియాగోఎయిర్ పోర్ట్లో రెండేళ్ల బాలుడు హంగామా సృష్టించాడు. ఎయిర్ పోర్ట్ లోని బ్యాగేజీ సిస్టమ్ కన్వేయర్ బెల్ట్ పై కూర్చొని ఎంచక్కా  కేరింతలు కొడుతూ ప్రయాణించాడు..ఖాళీ చెక్ ఇన్ డెస్క్ వెనక ఉన్న సిస్టమ్ పైకి ఎక్కి..కదిలే కన్వేయర్  బెల్ట్ పై బాలుడు ప్రయాణిస్తున్న సీసీ పుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈవీడియోను దాదాపు 5 మిలియన్ల మంది చూశారు. 

గత గురువారం (నవంబర్ 16) న చిలీలోని శాంటియాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖాళీ చెక్ ఇన్ డెస్క్ వెనక ఉన్న సిస్టమ్ పైకి బాలుడి దూసుకెళ్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. కదిలే కన్వేయర్ బెల్ట్ పై బాలుడు ప్రయాణిస్తున్న దృశ్యాలు విమానాశ్రయంలో కెమెరాలు బంధించాయి. ఎయిర్ పోర్ట్ సిబ్బంది బాలుడిని గమనించి బెల్ట్ పై నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు విమానాశ్రయంలో భద్రత, మౌలిక సదుపాయాలపై అనుమానం వ్యక్తం చేయగా.. శాంటియాగో ఎయిర్ పోర్ట్ అధికారులు వివరణ ఇచ్చారు.సీసీ కెమెరాలు, డిటెక్టర్లతో సహా మౌలిక సదుపాయాలు..అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నాం..మళ్లీ ఇలాంటివి జరగకుండా నిరోధించేందుకు ఎయిర్ లైన్ ఆపరేటర్లతో భద్రతా చర్యలు , ప్రోటోకాల్ పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు.
అయితే 2019లో అట్లాంటాలోని హార్ట్ ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని బ్యాగేజ్ బెల్ట్ పైకి ఎక్కిన ఘటనలో 2 ఏళ్ల బాలుడి చేయి విరిగింది.