హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా... కారులో ఎక్కించుకుని పారిపోయాడు. అఘాపురాలో రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. అగంతకుడి చేతిని కొరికి చాకచక్యంగా తప్పించుకుంది బాలిక. తర్వాత నాంపల్లి రైల్వే పోలీసులను ఆశ్రయించింది.
కిడ్నాప్ విషయం అంతా పోలీసులకు తెలియజేసింది బాలిక. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు నాంపల్లి రైల్వే పోలీసులు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.