నిజామాబాద్ జిల్లాలోవిషాద ఘటన చోటు చేసుకుంది. 2023 సెప్టెంబర్ 07 ఉదయం ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి హాయతి మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మార్గం మధ్యలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది.
ALSO READ:KPHB అడ్డగుట్టలో దారుణం : నిర్మాణంలోని అపార్ట్ మెంట్ గోడ కూలి ముగ్గురు మృతి
ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో చిన్నారి తల్లిందండ్రులు శోకసంద్రంలో మునిగారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై నిజమాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఓ ప్రైవేటు స్కూల్ లో హాయతి ఎల్ కేజీ చదువుతుంది.