నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లెలో బుధవారం నీటి సంపులో పడి చిన్నారి చనిపోయింది. చిన్నారి కుటుం బ సభ్యుల కథనం ప్రకారం.. రేబల్లెకు చెందిన గుండెబోయిన కీర్తన, జగదీశ్ ల పెద్ద బిడ్డ దీత్రిక (3) ఆడుకుంటూ వెళ్లి ఓపెన్ చేసి ఉన్న నీటి సంపులో పడిపోయింది.
పక్క ఇంటికి వెళ్లిన తల్లి కీర్తన.. ఇంటికి వచ్చి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో వెతికింది. చివరకు నీటి సంపులో చూడగా దీత్రిక విగతజీవిగా కనిపించింది. సంఘటనా స్థలాన్ని ఎస్సై పరమేశ్ పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.