![సెకండ్ షోలకు పిల్లల అనుమతి కేసు.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం](https://static.v6velugu.com/uploads/2025/02/child-permission-case-for-second-shows-single-judges-orders-cannot-be-interfered-with_NcdzVuKF6A.jpg)
హైదరాబాద్, వెలుగు: పిల్లలను సెకండ్ షో సినిమాలకు (రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటలలోపు) అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది.
సెకం డ్ షోలకు పిల్లలను అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ గురువారం విచారించింది.
వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లలో ప్రతివాదిగా చేరి ఎందుకు వాదనలు వినిపించలేదని ప్రశ్నించింది. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉన్నందున తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని క కోర్టు స్పష్టం చేసింది.