షాపుల్లో బాలల పరిరక్షణ విభాగం తనిఖీలు

షాపుల్లో బాలల పరిరక్షణ విభాగం తనిఖీలు

యాదాద్రి(భువనగిరి), వెలుగు : భువనగిరిలోని పలు షాపుల్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. బాలకార్మికులను పనిలో చేర్చుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతీయ బాలల హక్కుల కమిషన్​ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ విభాగం, కార్మిక, విద్య, మహిళా, శిశు సంక్షమ శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రెండు బృందాలుగా ఏర్పడి షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపుల యాజమానులతో బాలల సంక్షేమ సమితి చైర్మన్​బండారు జయశ్రీ మాట్లాడుతూ బాల కార్మికులను పనిలో చేర్చుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పనిలో చేర్చుకోమని షాపుల యజమానులుతో హామీ తీసుకున్నారు. అనంతరం బాలకార్మికులను పనిలో చేర్చుకోమని సూచిస్తూ షాపుల్లో స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో డీసీపీవో పులిగుజ్జు సైదులు, బాలరక్షా భవన్ కో-–ఆర్డినేటర్ పీ చందనేశ్వరి, బాలల సంక్షేమ సమితి సభ్యులు మల్లేశ్, ఇస్తారి, రుద్రమదేవి, కార్మికశాఖ, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ దశరథ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.