
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే రూ.20 వేలకు అమ్ముకునేందుకు ప్రయత్నించగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజు, శిశు గృహ మేనేజర్ ఝాన్సీ, సామాజిక కార్యకర్త రాజారాం అడ్డుకున్నారు.
మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఒక్కరోజు వయస్సున్న పాపను గజ్వేల్ లో నివాసముంటున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎండీ జామిన్, ముంతాజ్ దంపతులకు అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల సదరు మహిళ భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కాగా పాప నాలుగో సంతానం కావడంతో పోషించలేక అమ్ముతున్నట్లు ఆమె , బంధువులు తెలిపారు. పాపను అధికారులు సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.