Viral Video: బరితెగించిన రియాల్టీ షోలు.. చిన్న పిల్లోడి లిప్ కిస్ ఏంట్రా..

Viral Video: బరితెగించిన రియాల్టీ షోలు.. చిన్న పిల్లోడి లిప్ కిస్ ఏంట్రా..

చిన్నతనమే పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలవాట్లు అనేవి మంచివైనా, చెడ్డవైనా మన బాల్యమే మనకి నేర్పిస్తుంది. ఎందుకంటే, ఆ చిన్నతనంలో మనకి ఒరువడేది కల్మషం లేని కపటత్వం. అందుకే మన మంచి బాల్యమే.. మన మొదటి విజయం. అయితే, ఇప్పుడు ఇదంత ఎందుకంటారా? చిన్నతనంలోనే సింగర్గా ఎదిగిన ఓ కుర్రాడు.. ప్రముఖ సరిగమప షోలో తన వింత ప్రవర్తనతో అందరినీ అయ్యేలా చేశాడు. వివరాల్లోకి వెళితే...

ప్రముఖ తమిళ సరిగమప లైవ్ షోలో హీరోయిన్‌ కాయాదు లోహర్ (Kayadu Lohar)కు వింత అనుభవం ఎదురైంది. డ్రాగన్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కాయాదు లోహర్ 'తమిళ సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ సీజన్‌ 4' షోకు హాజరైంది. అక్కడ ఓ పిల్లాడు (లిటిల్ సింగర్) హీరోయిన్‌ను హత్తుకునే క్రమంలో లిప్ కిస్ పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తల తిప్పుకుంటున్నా, ఆ పిల్లాడు అలానే ముందుకుసాగుతూ ముద్దు పెట్టేలా ప్రయత్నించడంతో హీరోయిన్ ఒక్కసారిగా షాక్ తిన్నది. దీంతో షోలో ఉన్నవారందరూ తమ అరుపులు, కేకలతో ఉత్సాహం రెట్టింపు చేశారు.

అయితే ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రియాల్టీ షోలు ఓ చిన్న పిల్లాడితో ఇలా చేయించడం దారుణం అని అంటున్నారు.

సింగర్గా మంచి ఫ్యూచర్ ఉన్న ఈ బుడ్డోడిని ఇలా వాడుకోవడం చూస్తుంటే.. రియాల్టీ షోలు ఎలా బరితెగించాయో అర్ధం చేసుకోవొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు 'పిల్లలను పేరెంట్స్ చిన్నప్పుడే కంట్రోల్ లో పెడితే ఇలా అయ్యుండేది కాదని, షో నిర్వాహకులే ఇలా చేపించి వైరల్ చేసారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏదేమైనా చిన్నపిల్లల భవిష్యత్తు గాడిన పడాలంటే.. సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. ఈ 'సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ నాలుగో సీజన్‌కు' సింగర్‌ శ్వేతా మోహన్‌తో పాటు, దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

హీరోయిన్‌ కాయాదు లోహర్ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి (2022) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లవ్‌ టుడే ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న డ్రాగన్‌ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది.