నిజామాబాద్ ఆస్పత్రిలో కలకలం.. అర్థరాత్రి మూడేళ్ల బాబు కిడ్నాప్..

నిజామాబాద్ ఆస్పత్రిలో కలకలం.. అర్థరాత్రి మూడేళ్ల బాబు కిడ్నాప్..

నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి డెలివరి కోసం వచ్చింది ఓ కుటుంబం. డాక్టర్లు భార్యకు మరుసటి రోజు డెలివరీ చేస్తామనగా.. భర్త తన మూడేళ్ల బాబుతో కలిసి ఆస్పత్రి కారిడార్ లో నిద్రించాడు. ఇదే అదునుగా చూసిన కొందరు కేటుగాళ్లు ఆ బాబును ఎత్తుకెళ్లారు. ఉదయం భర్త లేచి చూడగా బాబు లేకపోవవడంతో కంగారుకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలో బాలున్ని ఎత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డ్ కావడంతో వాటిని రివైండ్ చేసి చూశారు. అందులో ఇద్దరు వ్యక్తులు బాబును ఎత్తుకెళ్లినట్టు కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.