సంగారెడ్డి, వెలుగు: డీజే కావాలి అంకుల్.. సంతోషంగా పండుగలు చేసుకుంటే ఎందుకు అంకుల్ ఆపేస్తారు. నాకు డీజే కావాలి అంటూ ఓ ఏడేళ్ల చిన్నారి ఎస్సైతో పట్టుబట్టి లొల్లి చేస్తుంటే అక్కడున్నవారు ముక్కు మీద వేలేసుకుని చూస్తుండిపోయారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట టౌన్లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహం నిమజ్జనోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిమజ్జనోత్సవంలో నిర్వాహకులు, పట్టణ ప్రజలు డీజే సౌండ్ పెట్టి ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. డీజేకు అనుమతి లేదని నిలిపేశారు. దీంతో సదాశివపేట పాతకేరికి చెందిన సంజీవ్(7) ఎస్సైతో డీజే పెట్టించాలని మారాం చేశాడు. అందరి మధ్యలో నిలబడి ఎస్సైతో ఇప్పుడైతే డీజే పెట్టించండి. ఏమైనా ఉంటే నిమజ్జనం తర్వాత చూసుకోండి.. సంతోషంగా పండుగ చేసుకుంటే ఎందుకు అంకుల్ ఆపేస్తారని ధైర్యంగా మాట్లాడాడు. పక్కనున్నవారు ఇదంతా చూసి నవ్వుకున్నారు. బాలుడి తీరు పోలీసులకు సైతం నవ్వు తెప్పించింది. ఇదంతా ఎవరో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
డీజే కావాలి అంకుల్.. ఎస్సైతో ఏడేళ్ల చిన్నారి మారం
- తెలంగాణం
- October 18, 2021
లేటెస్ట్
- తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ వికటకవి : ఫేమ్ ప్రదీప్ మద్దాలి
- ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది .. దాడికి కుట్ర చేస్తున్నా గుర్తించరా : సీఎం రేవంత్
- ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను నియమించండి : సీఎం రేవంత్ రెడ్డి
- దండకారణ్యంలో మరో రెండు కొత్త బేస్ క్యాంపులు
- చెట్టు కూలి ఆటో ధ్వంసం
- మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్
- రీడిజైనింగ్ ఎందుకు.. అంచనాల పెంపు దేనికి?
- సత్యసాయి ఆసుపత్రి సేవలు భేష్: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్
- లగచర్ల దాడి వెనుక ఎవరున్నా వదలొద్దు..దోషులను కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాలు
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?