Virat Kohli: ఇండియాకు కోహ్లీ గుడ్ బై.. లండన్‌లో సెటిల్ : కన్ఫామ్ చేసిన కోచ్

Virat Kohli: ఇండియాకు కోహ్లీ గుడ్ బై.. లండన్‌లో సెటిల్ : కన్ఫామ్ చేసిన కోచ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లండన్ లో సెటిల్ అవుతాడనే వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. తరచూ కోహ్లీ లండన్ లో ఉండడమే దీనికి కారణం. అయితే కోహ్లీ లండన్ లో సెటిల్ అవుతాడా లేదా అనే సస్పెన్స్ కు అతని అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ సస్పెన్స్ కు తెరదించాడు. కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి లండన్ కు షిఫ్ట్ అవబోతున్నాడని రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. 

"విరాట్ కోహ్లి తన భార్య అనుష్క, పిల్లలతో కలిసి లండన్ కు షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాడు. త్వరలోనే ఇండియా వదిలి వెళ్లనున్నాడు. అయితే ప్రస్తుతానికైతే అతడు క్రికెట్ కాకుండా ఎక్కువ భాగంగా తన కుటుంబంతోనే గడుపుతున్నాడు." అని దైనిక్ జాగరన్ తో రాజ్ కుమార్ శర్మ చెప్పాడు. ఈ ఏడాది మొదట్లోనే అతనికి అకాయ్ అనే కొడుకు లండన్ లోనే జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విరాట్, అనుష్కకు లండన్ లో ఓ ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కోహ్లి ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అనుష్క, పిల్లలు కూడా అతనితోనే ఉన్నారు.

2024లో విరాట్ చాలా వరకు లండన్ లోనే కనిపించాడు. ఫిబ్రవరి 15న అతనికి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. జూన్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కోసం తిరిగి టీమిండియాతో చేరాడు. అది ముగియగానే మరోసారి యూకేకు వెళ్లాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడినా అది ముగిసిన తర్వాత మళ్లీ లండన్ వెళ్లడం విశేషం. ఆగస్టు వరకు అతడు అక్కడే ఉన్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కోసం ఇండియాకు వచ్చిన అతడు.. అప్పటి నుంచీ అక్కడే ఉన్నాడు.