
కోల్ బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్పట్టణానికి చెందిన బిల్ల వంశీ కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. బిల్ల వంశీ గతేడాది సెప్టెంబర్15న కరెంట్షాక్తో చనిపోయాడు.
విషయం తెలుసుకున్న ఆయనతో పాటు అల్ఫోన్సా కాన్వెంట్హైస్కూల్ లో 2002 పదో తరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థులు సోమవారం వంశీ భార్య స్రవంతికి పోస్టాఫీసులో డిపాజిట్చేసిన రూ.7 లక్షల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పత్రాలు అందించారు. వంశీ పిల్లల భవిష్యత్ కోసం రూ.7 లక్షలు అందించామని తెలిపారు.