బిడ్డ తొలి అడుగేసిందంటే.. ఎలాంటి తీపి ఙ్ఞాపకాలో తెలుసా..

బిడ్డ తొలి అడుగేసిందంటే.. ఎలాంటి  తీపి ఙ్ఞాపకాలో తెలుసా..

ఇంట్లో చిన్నారి పుట్టడంతోనే బుడి .. బుడి అడుగుల కోసం  తాతమ్మలు.. బామ్మలు.. ఎదురు చూస్తారు.  ఇక  తల్లిదండ్రులైతే ఎప్పుడు అడుగేస్తుందా.. అలాంటి మధురమైన ఙ్ఞాపకాలను జీవితాంతం గుర్తుండేలా ఫొటోలు.. వీడియోలుల తీసి పదిలపరుచుకుంటారు.  

కన్నబిడ్డ తొలిసారిగా వేసే బుడిబుడి అడుగులు ఏ తల్లిదండ్రులకైనా ప్రత్యేక జ్ఞాపకం చాలా మంది ఆ క్షణాలు పదిల పరుచుకుంటారు. కానీ, జీవితంలో తమ బిడ్డ అస్సలు నడవలేదని తెలిసిన మరుక్షణం ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. 

న్యూయార్క్ నగరంలోని  బఫెల్లో ప్రాంతానికి చెందిన లెరెంజో జెనెసిస్ దంపతులు ఇలాంటి నరకాన్నే అనుభవించారు.  ఈ జంటకు కూతురు పుట్టింది. కానీ, వంకర కాళ్లతో పుట్టడంతో ఆ బిడ్డ జీవితంలో ఇంక నడవలేదని డాక్టర్లు తేల్చేశారు. ఆ పాపకు 'లారెన్ బకానా' అని పేరు పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. 

ALSO READ | Mahasivaratri 2025: శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. జాగారం ఎందుకు చేస్తారు..

అరుదైన సమస్య కావడంతో స్పెషలిస్టులకు చూపించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చిన్నారి బాగోగుల కోసం ఇంట్లో ప్రత్యేకంగా కేర్ యూనిట్ ఏర్పాటు చేశారు. అయితే, 11 నెలల వయసులో ఓ రోజు రాత్రి తనంతట తానే లేచి నిల్చుంది బకానా కేరింతలు కొడుతున్న పాపను చూసి లారెన్ ఉద్వేగానికి లోనయ్యాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ క్షణాలను తన ఫోన్లో పాప ఫొటోలను, వీడియోను తీశాడు.

 బకానా ఇప్పుడు జింక పిల్లలా గంతులు వేస్తోంది. లారెన్ ఆ మధుర క్షణాలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. 'డబ్బు కూడా మనిషికి అందించలేని కొన్ని సంతోషాలు ఉంటాయి. నాకు నా కూతురు వేసిన తొలి అడుగు అలాంటిదే' అని సందేశం ఉంచాడు. వైద్యులు మాత్రం బకానా కేసును ఓ అద్భుతంగా అభివర్ణించారు.

-వెలుగు,లైఫ్​–