శివరాత్రి ఉరేగింపులో విషాదం 14మంది పిల్లలకు కరెంట్ షాక్

శివరాత్రి ఉరేగింపులో విషాదం 14మంది పిల్లలకు కరెంట్ షాక్

మహా శివరాత్రి రోజు ఉరేగింపులో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని కోటాలో శివ బారాత్ ఉత్సవంలో దాదాపు  14 మంది చిన్నారులు విద్యుతాఘాతానికి గురైయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాళీ బస్తీ నుండి భక్తులు కలశంతో ఉరేగింపుగా బయలుదేరారు. అదే సమయంలో ఓ పిల్లవాడు 20 ఫిట్స్ ఉండే  ఐరన్ పైప్ పట్టుకొని వెళ్తున్నాడు. పైప్ హైటెన్షన్ వైర్లకు తాకి బాబుతో పాటు చుట్టు పక్కల ఉన్న 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. 

వారిని కోటలోని MBS హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సీరియస్ గా ఉన్నవారిని జైపూర్‌ లోని మరో హాస్పిటల్ కు రిఫర్ చేశారు. వారిలో 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తప్పా మిగితావారందరూ 14సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఓ పిల్లాడికి  లోక్ సభ స్పీకర్, కోటా ఎంపీ  ఓం బిర్లా ప్రమాదంపై స్పందించారు. చిన్నారులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

ALSO READ :- శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి... లక్షల మందితో కిటకిట

రాజస్థాన్ మంత్రి హీరాలాల్ నగర్ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన సంఘటన, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు, ఒకరికి 100% కాలిన గాయాలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరి  నిర్లక్ష్యమైన ఉంటే విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.