
స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ రావడంతో పిల్లల సందడి మొదలైంది. కొందరు మొబైల్స్, టీవీల్లో గేమ్స్ ఆడుతూ వాటికే అతుక్కుని పోతుంటే.. చాలా వరకు మైదానాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు తమ తల్లిదండ్రులను ఒప్పించి, అవసరమైన స్పోర్ట్స్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు.
ఆదివారం ఎర్రగడ్డలోని రోడ్డు పక్కన కొందరు పిల్లలు తమ పేరెంట్స్ తో క్రికెట్ బ్యాట్స్ కొనుగోలు చేస్తూ కనిపించారు.
– సిటీ ఫొటో గ్రాఫర్, వెలుగు