ఖైదీల పిల్లల ​బాధ్యత ఆఫీసర్లదే : సునీతా లక్ష్మారెడ్డి

నిజామాబాద్,  వెలుగు: మహిళా ఖైదీల పిల్లలను రెసిడెన్సియల్​స్కూళ్లలో చేర్పించాలని  స్టేట్​మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ ను కోరారు. ఈ విషయంపై కలెక్టర్ కు లెటర్​రాయాలని  సూచించారు.  మంగళవారం ఆమె తన కమిషన్​మెంబర్లతో కలిసి  సారంగాపూర్ లోని జిల్లా జైలును విజిట్​చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీల వెంట  ఉన్న  పిల్లల భవిష్యత్​బాధ్యతను ఆఫీసర్లు తీసుకోవాలన్నారు.  

జైలు జీవితం గడుపుతున్న వారిలో సత్​ప్రవర్తన పెంపొందేలా యోగా క్లాసులు ఏర్పాటు  చేయాలని, సఖీ కేంద్రానికి చెందిన నిపుణుల ద్వారా కౌన్సిలింగ్​ఇప్పించాలన్నారు.  ఖైదీలు జైలులో తయారు చేస్తున్న వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసి, వారి ఉపాధిని ప్రోత్సహించాలని సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. కమిషన్  మెంబర్లు షాహీన్, రేవతి, లక్ష్మీ, పద్మ, ఈశ్వరీ బాయి, ఉమాదేవి, డైరెక్టర్ శారద, నిజామాబాద్​ఆర్డీవో రవి, జిల్లా  ఉమెన్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​ఆఫీసర్​సుధారాణి పాల్గొన్నారు.  

 మతసామరస్యానికి ప్రతీక బడాపహాడ్ ‌‌ ‌‌ దర్గా


 వర్ని : మత సామరస్యానికి ప్రతీకగా షాదుల్లా హుస్సేని (బడా పహాడ్ ‌‌ ‌‌) బాబా దర్గా అని  ‌‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం దర్గాను రాష్ర్ట మహిళా  కమిషన్​మెంబర్లతో కలిసి ఆమె  విజిట్​చేశారు. రాష్ట్రంలోనే పేరొందిన దర్గాను  దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.