వీరి బాల్యం..ఎంత బరువైందో..!

ఓసారి ఈ చిన్నారులను చూడండి.. చిల్డ్రన్స్ డే రోజు హ్యాపీగా గడపాల్సింది పోయి భుజాన గోనె సంచులు వేసుకొని చెత్త ఏరుకోవడానికి పోటీ పడ్డారు. గురువారం సూరారం పరిధిలో కంటపడిన వీరిని ‘వెలుగు’ ఆపి, వివరాలు అడిగే ప్రయత్నం చేసింది. కానీ, ఆ చిన్నారులు భయపడి అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. దేశంలో నిర్బంధ విద్య నేటికీ సరిగ్గా అమలు కావడం లేదనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. 

 – వెలుగు, జీడిమెట్ల