నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్ బాబు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జెడ్పి హైస్కూల్లో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకూ హక్కులు ఉన్నాయని, వాటిని పరీరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు, న్యాయ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన కబడ్డీ, కోకో, క్రికెట్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, డీఈఓ గోవిందరాజులు, న్యాయవాదులు పాల్గొన్నారు.