జీవో నంబర్ 317కు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీచర్లు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఓ ఇద్దరు పిల్లలు.. వారి తల్లిదండ్రులు వేర్వేరు జిల్లాలకు బదిలీ కావడంపై నాన్న ఒక జిల్లా.. అమ్మ ఒక జిల్లా.. నేను ఏ జిల్లా కేసీఆర్ తాత.. అంటూ ముగ్గు వేసి వారి ఆవేదన తెలియజేశారు. ఈ ముగ్గు కేటీఆర్‌కు సైతం ట్వీట్టర్‌లో ట్యాగ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట కూడా టీచర్లు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. 13 జిల్లాలను అన్‌బ్లాక్ చేసి, భార్యా భర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్‌లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్