మామూలుగా పసి పిల్లలు చేసే పనులేంటి? చక్కగా పాలు తాగుతారు... నిద్ర పోతారు. ఆడుకుంటారు... అయితే ఇంకొందరు ఇవన్నీ చేస్తూనే... తరచూ ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియక తల్లిదండ్రులు బాగా కంగారు పడుతుంటారు. అలా ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవాలి. సమస్య నుంచి సాధ్యమైనంత త్వరగా వాళ్లని దూరం చేయాలి.
ఆకలి వేసినప్పుడు... పక్క తడుపుకున్నప్పుడు.. చీమలు లేదా పురుగు ఏదైనా కుట్టినప్పుడు... చికాకు కలిగినప్పుడు, విసుగు పుట్టినప్పుడు. అమ్మ దగ్గరగా తీసుకోవాలని ఇలా పలు రకాల కారణాల వల్ల ఏడుస్తారు. ఇలాంటి కారణాలు లేకుండా కూడా ఏడుస్తున్నారంటే... దాన్ని కాలిక్ పెయిన్ అంటారు.
కాలిక్ పెయిన్ అంటే?
ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, రోజుకు మూడు గంటల కన్నా ఎక్కువ సమయం ఏడుస్తుంటే... వాళ్లు కాలిక్ పెయిన్ తో బాధపడుతున్నట్లు అడ్డ చేసుకోవాలి. ఇది రెండు వారాల పసి పిల్లల నుంచి... మూడు నాలుగు నెలల పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఆడ, మగ అని తేడా ఉండదు.కారణాలేంటి?
- పొట్టలో నొప్పి
- కడుపులో గ్యాస్ చేరుకోవడం
ఏం చేయాలి?
- పిల్లలకు తల్లిపాలు పడకపోతే డాక్టర్ సంప్రదించి ఆవు పాలు లేదా పౌడర్ పాలు పట్టాలి.
- బాటిల్ పాలు తాగే పిల్లల్లో అయితే... బాటిల్ నిపుల్ తరచూ మార్చాలి.
- ఖాళీ బాటిల్ ను పిల్లలకు ఇవ్వకూడదు.. దానివల్ల పిల్లలో గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది.
- ఏడుస్తున్న పిల్లలను బయటికి తీసుకెళ్లి తిప్పాలి, నలుగురు మనుషులు తిరుగుతున్న చోటుకు తీసుకెళ్లాలి
- బేబీ ఆయిల్ తో మసాజ్ చేయాలి.
- ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపినా ఏడుపు ఆపుతారు
- గోరువెచ్చని నీళ్లలో పిల్లలను కొద్దిసేపు ఆడించాలి.
- ఏం చేసినా ఏడుపు ఆపలేదంటే... ఏదో సమస్య వాళ్లని గట్టిగా బాధిస్తున్నట్లే... అందుకే వెంటనే డాక్టర్ వద్దకు వద్దకు తీసుకెళ్లాలి.
- తల్లిపాలు పడకపోవడం
- లాక్టోజ్, ఆవు పాలు పడకపోవడం
- అధిక కాంతి, శబ్దం వల్ల ఇబ్బంది పడటం
- సరిగా ఎదగని నాడీ వ్యవస్థ
-వెలుగు, లైఫ్-